ఆపరేషన్ దుర్యోధన , ఈ సినిమాను ఎవరూ మర్చిపోలేరు . విచిత్రమైన కధనంతో రాజకీయ నేపధ్యంలో ల వచ్చిన సినిమా . ఈ సినిమా ఎంత ఆదరణ పొందిందో అందరికీ తెలుసు . శ్రీకాంత్ నటనలోని మరో కోణాన్ని తెలియజేసిన పాత్ర . చాలా సంవత్సరాల తరువాత “ఆపరేషన్ 2019” అనే టైటిల్ తో సినిమా తెరకేక్కబోతోంది . దీనికి బివేర్ అఫ్ పబ్లిక్ అనేది ఉపశీర్షిక . ఈ చిత్రాన్ని అలివేలమ్మ ప్రొడక్షన్ బ్యానర్ పై అలివేలు నిర్మించగా కారణం బాబ్జి దర్శకత్వం వహించారు.

ఈ సినిమా ట్రైలర్ చూస్తే ఇది కూడా ఆపరేషన్ దుర్యోధన లాగా రాజకీయ నేపధ్యంలో జరిగే కధ అని అర్ధం అవుతోంది . ట్రైలర్ లో శ్రీకాంత్ చాలా రఫ్ గా కనిపిస్తున్నారు . “గాంధీ కడుపున గాంధీ పుట్టడు , ఎన్టీఆర్ కడుపున ఎన్టీఆర్ పుట్టడు , మెగాస్టార్ కడుపున మెగాస్టార్ పుట్టడు ఎవ్వరైనా జనంలో నుంచి రావాలి “ అనే డైలాగ్ ట్రైలర్ లో హైలైట్ గా నిలుస్తోంది . ఈ చిత్రానికి ర్యాప్ రాక్ షకీల్ సంగీతం అందిస్తున్నారు.

https://youtu.be/tOL_e9o859o

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments