ఇటీవల తెలుగులో వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ హీరో నాని . గతంలో ఒక తమిళ్ సినిమాలో నటించిన నాని ఇప్పుడు తన రెండోవ తమిళ్ సినిమాతో వస్తున్నారు . సముద్రఖని దర్సకత్వంలో “వేలన్ ఎట్టుత్తిక్కుమ్” అనే సినిమా రూపొందుతోంది . ఈ చిత్రం లో నాని కి జంటగా అమలాపాల్ నటిస్తున్నారు.

ఈ సినిమాలో అవినీతి అక్రమాలపై పోరాడే యువకుడిగా నాని కనిపించనున్నారు. సామాజిక సందేశంతో కూడిన యాక్షన్ మూవీగా ఈ సినిమా రూపొందుతోంది . ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు . వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని తెలుగు , తమిళ్ బాషలలో విడుదల చేయనున్నారు . ఈ సినిమాతో నాని తమిళ్ లో కూడా మంచి విజయాన్ని అందుకుంటారని సినీ విశ్లేషకులు అంటున్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments