చెలి,సఖి వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరో మాధవన్ . ఈయన ప్రస్తుతం నాగచైతన్య హీరోగా నటిస్తున్న సవ్యసాచి సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసినదే అయితే ఇప్పుడు ఆయన మరో తెలుగు సినిమా అంగీకరించారన్న వార్త వినిపిస్తోంది. స్వీటీ అనుష్క నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటించేందుకు మాధవన్ ఓకే చెప్పారట . ధ్రిల్లర్ జానర్ లో తెరకెక్కనున్న ఈ సినిమాకు హేమంత్ మధుకర్ దర్సకత్వం వహిస్తున్నారు . ఈ ప్రాజెక్ట్ గురుంచి చిత్ర బృందం నుండి త్వరలో అధికారిక ప్రకటన రానుంది.
మరో తెలుగు సినిమాలో మాధవన్…
Subscribe
Login
0 Comments