బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో ఈరోజు అడ్వాన్స్డ్ బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్ యూనిట్ ను సినీ హీరో నందమూరి బాలకృష్ణ , తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు . ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ సినీ పరిశ్రమలో తనకు అందరికంటే ఎంతో ఇష్టమైన నటుడు బాలకృష్ణ అని తెలిపారు . దివంగత ఎన్టీఆర్ మీద అభిమానంతో తనకు తారకరామారావు అనే పేరును కేసీఆర్ పెట్టారని , తారకరామారావు పేరును నిలబెట్టే పనులే చేస్తానని , చెడగొట్టే పనులు మాత్రం చేయన్నన్నారు .

ఇంకా మాట్లాడుతూ “బసవతారకం ఆసుపత్రి గురుంచి మా అమ్మ నాకు కనీసం వంద సార్లు చెప్పి ఉంటారు . ఆసుపత్రికి వచ్చే రోగుల వసతికి , ఆసుపత్రి అభివృద్ధికి ఏదో ఒకటి చేయాలని చెప్పేవారు” అని కేటీఆర్ తెలిపారు . తాను మంత్రి అయిన తరువాత కూడా ఆసుపత్రి గురుంచి అమ్మ చాలా సార్లు గుర్తు చేశారని చెప్పారు .

క్యాసర్ ను అవగాహనతోనే నిర్మూలించగలమని , క్యాన్సర్ పట్ల ప్రజల్లో అవగాహన పెంచాలని కేటీఆర్ అన్నారు . సెలబ్రిటీలంతా క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని కోరారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments