అప్పుడప్పుడు సెలబ్రిటీస్ తమ సహచరులకు సోషల్ మీడియా వేదికగా వివిధ రకాలైన సవాళ్లు విసురుతుంటారు . ఒలింపియన్, కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ చేసిన ఓ ఫిట్ నెస్ చాలెంజ్ ని స్వీకరించి, దాన్ని పూర్తి చేసిన విరాట్ కోహ్లీ, తను చేసిన చాలెంజ్ ని స్వీకరించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ, ఎంఎస్ ధోనీ, తన భార్య అనుష్క శర్మలకు సవాల్ విసిరాడు. రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్, మంగళవారం నాడు తాను పుషప్స్ తీస్తున్న వీడియోను ట్వీట్ చేస్తూ, ‘ఫిట్ నెస్ మంత్ర’ అని ట్యాగ్ లైన్ తగిలించి హృతిక్ రోషన్, విరాట్ కోహ్లీ, సైనా నెహ్వాల్ లకు సవాల్ విసిరాడు. ఇక ఎల్లప్పుడూ ఫిట్ నెస్ కోసం తాపత్రయపడే కోహ్లీ, ఈ వీడియోను చూసి, దానిలోని చాలెంజ్ ని స్వీకరించి, అందులో చూపించినట్టుగా స్పైడర్ ప్లాంక్ చేశాడు. ఆ వీడియోను ట్వీట్ చేస్తూ, ఇదే చాలెంజ్ ని తాను తన భార్య, మన ప్రధాని, సోదరుడు ధోనీకి విసురుతున్నా అని వ్యాఖ్యానించాడు. కోహ్లీ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
ప్రధానిని సవాల్ చేసిన విరాట్ కోహ్లీ…
Subscribe
Login
0 Comments