సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా కాలా . కబాలి సినిమాకు దర్సకత్వం వహించిన పా రంజిత్ ఈ సినిమాకు దర్సకత్వం వహించగా హీరో ధనుష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సామాన్యంగా రజనీకాంత్ సినిమా అంటే యమా క్రేజ్ కాకపోతే రజనీ చివరి మూడు సినిమాలు పరాజయమవ్వడంతో ఫాన్స్ ఈ సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు .

తమిళ్ తరువాత రజనీకి తెలుగు పెద్ద మార్కెట్ . తెలుగు రాష్ట్రాలలో కూడా రజనీకాంత్ అభిమానులు పెద్దసంఖ్యలో ఉన్నారు . తెలుగు ప్రజలు సంతోష పడేలా చిత్రబృందం ఒక ప్రకటన వెల్లడించింది . అదేంటంటే మే 29 వ తారీఖున సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్ నోవెటల్ లో కాలా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు . ఈ సినిమాలో రజనీకి జోడిగా హ్యూమా ఖురేషీ నటిస్తుండగా నానా పటేకర్ కీలక పాత్రలో కనిపించనున్నారు . జూన్ 7 ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments