చంద్రబాబు కొత్త పెళ్లికూతురు వైపు చూస్తున్నారు

0
270

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రతిపక్ష నేత జగన్ తీవ్ర విమర్శలు చేశారు. నాలుగేళ్లపాటు బీజేపీతో కాపురం చేసి విడాకులు తీసుకున్న చంద్రబాబు… ఇప్పుడు కొత్త పెళ్లికూతురు (కాంగ్రెస్) వైపు చూస్తున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీతో విడిపోయాక ఇతరులపై నెపం నెట్టేసేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు కంటే పెద్ద అబద్ధాల కోరు మరొకరు లేరని అన్నారు.

‘కర్ణాటకలో ఎమ్మెల్యేలను కొనడం చంద్రబాబుకు బాధను కలగజేసిందట’ అంటూ ఎద్దేవా చేశారు. మరి ఏపీలో 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్టు కొనడంపై ఏం చెబుతారని ప్రశ్నించారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందని…. కాంట్రాక్టులు, మట్టి, ఇసుక, మద్యం, బొగ్గు, రాజధాని భూములు, గుడి భూములు, చివరకు గుడిలోని ఆభరణాలను కూడా వదలడం లేదని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here