పవన్ కల్యాణ్ కు భారీ భద్రత

0
264

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఏపీ ప్రభుత్వం భారీ భద్రతను కల్పించింది. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ త్రివిక్రమ వర్మ మాట్లాడుతూ, జిల్లాలోని మూడు సబ్ డివిజన్ పోలీసు అధికారులు పవన్ కు భద్రతను కల్పించాలంటూ డీఎస్పీలకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. రోప్ పార్టీ, మఫ్టీ కాంపొనెంట్, ట్రాఫిక్ కాంపొనెంట్, లా అండ్ ఆర్డర్ కాంపొనెంట్, పీఎస్ఓలు పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తాయని తెలిపారు. పవన్ బస చేస్తున్న విడిది వద్ద కూడా భద్రత ఉంటుదని చెప్పారు. పవన్ కల్యాణ్ కు భద్రత విషయంలో తాము ఎక్కడా రాజీ పడలేదని అన్నారు. పవన్ బౌన్సర్లపై దాడి జరిగినట్టు, వారికి దెబ్బలు తగిలినట్టు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని చెప్పారు. పవన్ కు సరైన భద్రత కల్పించలేదన్న వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here