ఈరోజు హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో తెలంగాణ తెలుగుదేశం మహానాడు జరగనున్న విషయం తెలిసినదే . ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హైదరాబాద్ కు చేరుకుంటారు. ఆయన షెడ్యూల్ ఈ విధంగా ఉంది

చంద్రబాబు మధ్యాహ్హ్నం 12 గం 30 నిమిషాలకు ఉండవల్లి లోని తన క్యాంపు కార్యాలయం వద్ద హెలికాప్టర్ లో బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుండి ప్రత్యేక విమానంలో మధ్యాహ్హ్నం 1 గం 40 నిమిషాలకు హైదరాబాదులోని బేగుంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు . అక్కడి నుండి నేరుగా రోడ్డు మార్గంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కు చేరుకొని తెలంగాణ తెలుగుదేశం మహానాడులో పాల్గొంటారు .

ఈ కార్యక్రమం అనంతరం హైదరాబాదు లోని తన నివాసానికి చేరుకొని ఒక రోజు పాటు కుటుంబంతో గడుపుతారు . తిరిగి మే 25 వ తేదీ సాయంత్రం 4 గం 30 నిమిషాలకు బేగుంపేట విమానాశ్రయానికి చేరుకొని , ప్రత్యేక విమానం ద్వారా గన్నవరానికి చేరుకొని అక్కడి నుంచి హెలికాప్టర్ లో ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు..

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments