త‌న అసామాన్య బ్యాటింగ్ విన్యాసాల‌తో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికుల‌ను అల‌రించిన ద‌క్షిణాఫ్రికా దిగ్గ‌జ ఆట‌గాడు ఏబీ డివిల్లియ‌ర్స్ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నానంటూ హ‌ఠాత్తుగా ప్ర‌క‌టించి అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. త‌న రిటైర్మెంట్ నిర్ణ‌యాన్ని ట్విట‌ర్ ద్వారా డివిల్లియ‌ర్స్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.
`అంత‌ర్జాతీయ క్రికెట్ నుంచి త‌క్ష‌ణ‌మే వైదొల‌గాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాను. 114 టెస్టులు, 228 వ‌న్డేలు, 78 టీ20లు ఆడాను. ఇప్పుడు వేరొక‌రు నా బాధ్య‌త‌ను తీసుకోవాల్సిన స‌మ‌యం వ‌చ్చేసింది. నిజం చెప్పాలంటే నేను అలసిపోయాను` అంటూ ఏబీ ట్వీట్ చేశాడు. దీంతో ఏబీని ప్ర‌శంసిస్తూ, అత‌నికి శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ సోష‌ల్ మీడియాలో విషెస్ పోటెత్తాయి. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క కూడా ట్విట‌ర్ ద్వారా ఏబీకి విషెస్ అంద‌చేసింది. `జీవితంలో మ‌న కోసం మ‌నం సాధ‌న చేయ‌డం కంటే ఇతరుల జీవితాల‌పై ప్ర‌భావం చూపేవిధంగా జీవించ‌డం ఎక్కువ అర్థ‌వంత‌మైన‌ది. మీరు ఆ రెండు ప‌నుల‌ను స‌మ‌ర్థంగా నిర్విహించారు. ఎప్పుడూ అదే స్ఫూర్తితో, ఉత్సాహంతో ముందుకెళ్లాల‌ని కోరుకుంటున్నాను. నువ్వు, డానియెల్ (ఏబీ భార్య‌) ఆనందంగా జీవించాల‌ని కోరుకుంటున్నానం`టూ అనుష్క ట్వీట్ చేసింది.
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments