ఈ మధ్య సినీ ప్రేక్షకులు రొటీన్ గా ఉండే కమర్షియల్ ఎలిమెంట్ కు భిన్నంగా ఉండే సినిమాలను బాగా ఆదరిస్తున్నారు. అందులో ఒక జానర్ కుటుంబ కథా చిత్రాలు . ఈ చిత్రాలలో కుటుంబంలోని బంధాలు అనుభంధాలు బాగా చూపించడంతో విజయవంతం అవుతున్నాయ్ . పోయిన సంవత్సరం కుటుంబ కధాంశంతో శర్వానంద్ హీరో గా వచ్చిన శతమానం భవతి . ఈ సినిమా ఏకంగా జాతీయ అవార్డును సాధించింది. ఇలాంటి ఫార్మట్ లోనే నాగశౌర్య హీరో గా నటిస్తున్న అమ్మాగారిల్లు సినిమా తెరకెక్కుతోంది .
తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలయ్యింది . ఈ సినిమా ట్రైలర్ లో కుటుంబం ఉన్న అనుబంధాలు బాగా చూపించారు . శతమానం భవతి సినిమా ధోరణిలో ఈ సినిమా కూడా ఉన్నట్టు అనిపిస్తోంది . ఇక ఈ ట్రైలర్ లో జీవితంలో కలిసి రావాలంటే కూతుర్ని కనాలి… తెలిసిరావాలంటే కొడుకును కనాలి అంటూ రావు రమేశ్ చెప్పిన డైలాగ్‌లు బాగానే ఉన్నాయి . ఈ సినిమాకు నగశౌర్య కు జోడీగా షామిలి నటించారు . ఈ సినిమాను స్వాజిట్ బ్యానేర్ పై రాజేష్ నిర్మించగా సుందర్ సూర్య దర్సకత్వం వహించారు . ఈ సినిమా మే 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది .