కర్ణాటక రాష్ట్రంలో ఈ రోజు కాంగ్రెస్, జనతాదళ్ (సెక్యులర్) ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా జేడీఎస్ నేత కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో ఈ రోజును ‘ప్రజా తీర్పు వ్యతిరేక దినం’గా బీజేపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా పాటిస్తున్నాయి. దీనిపై మాజీ సీఎం, బీజేపీ శాసనసభాపక్ష నేత బీఎస్ యడ్యూరప్ప స్పందిస్తూ… ‘‘ఆకలి, దురాశ, అధికారం అన్నవి జేడీఎస్-కాంగ్రెస్ కూటమికి మూలకాలు. ఈ సంకీర్ణం మూడు నెలలు కూడా కొనసాగదు’’ అని అన్నారు. నేడు సాయంత్రం జరిగే కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ అధ్యక్షుడు రాహుల్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇతర ముఖ్య నేతలు హాజరుకానున్న విషయం తెలిసిందే.
కొత్త ప్రభుత్వం మూడు నెలలు కూడా ఉండదు…
Subscribe
Login
0 Comments