తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో అనేక ఆరోపణలు వస్తున్న విషయం తెలిసినదే. ముఖ్యంగా దేవస్థానంలోని పోటు నెల మాళిగలోని విలువైన ఆభరణాలు అదృశ్యమయ్యాయని రమణ దీక్షితులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం పై వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చంద్రబాబు పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అదృశ్యమైన ఆభరణాలు అమరావతి, హైదరాబాద్ లో ఉన్న చంద్రబాబు నాయుడు నివాసాలకు తరలించారని ఆరోపించారు,
12 గంటలలోగా సీబీఐ లేదా తెలంగాణ పోలేసులతో చంద్రబాబు నివాసాలలో తనిఖీలు చేయిస్తే ఆభరణాలు బయపడతాయని, ఒకవేళ దొరకకపోతే తన పదవికి రాజేనామా చేస్తామన్నారు. చంద్రబాబుకు 12 గంటలు కంటే ఎక్కువ సమయం ఇస్తే తిరుమల ఆభరణాలు విదేశాలకు తరలిపోతాయని అన్నారు . ఒక్క హెరిటేజ్ వ్యాపారంతోనే చంద్రబాబు ఇన్ని ఆస్తులు కూడబెట్టారంతే సాధ్యమైన పని కాని ఆయన చెప్పారు.
తన కుమారుడు లోకేష్ పై అసత్య ప్రచారం చేస్తున్నారని అంటున్న చంద్రబాబు ఎందుకు సీబీఐ విచారణ కోరడంలేదని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు.