అక్కినేని నాగచైతన్య కధానాయకుడిగా ప్రేమమ్ సినిమాతో మంచి హిట్ అందుకున్న దర్శకుడు చండూ ముండేటి దర్సకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సవ్యసాచి . ఈ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రంలో చైతూ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఒక ఆశక్తికర వార్త ఫిలిం నగర్ వర్గాలలో వినిపిస్తోంది .  యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో మిల్కీ బ్యూటీ తమన్నా కనిపించనున్నారట. గతంలో అల్లుడు శీను, స్పీడున్నోడు, జై లవకుశ చిత్రాలలో స్పెషల్ సాంగ్స్ లో తమన్నా కనిపించిన విషయం తెలిసినదే . అయితే ఈ విషయంపై చిత్రబృందం నుండి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments