మెగా మేనల్లుడు సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ కు ఈమధ్య విడుదలైన సినిమాలు ఆశించినంత ఫలితాన్ని ఇవ్వలేక పోయాయి, అందుకనే ఇప్పుడు ఆయన చూపు ప్రేమ కధలపై పడినట్టు కనిపిస్తోంది. ప్రేమ కథలను అద్బుతంగా ఆవిష్కరించగల కరుణాకరన్ దర్సకత్వం లో “తేజ్ ఐ లవ్ యు” సినిమా చేస్తునట్టున్నారు.

తదుపరి చిత్రం నేను శైలజ సినిమాకు దర్సకత్వం వహించిన కిషోర్ తిరుమల తో ఒక సినిమా చేయనున్నారని సమాచారం. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం లో ఇప్పటికే కళ్యాణి ప్రియదర్శన్ ను ఎంపిక చేయగా, మరో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ను ఫైనల్ చేసినట్టు వార్తలు వచ్చాయి , కానీ ఇప్పుడు అనుపమ స్థానంలో వెంకటేష్ గురు ఫేం రితికా సింగ్ పేరు వినిపిస్తోంది. సాయిధరమ్ తేజ్ మరి ఎవరితో ఆడి పాడతారో అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాలి.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments