నేను డామినేట్ చేస్తున్నానని ఆ హీరో ఫీలయ్యారు…

0
299

తెలుగు తెరపై ఎన్నో విభిన్నమైన పాత్రలను చేస్తూ మెప్పించిన పృథ్వీరాజ్, తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. “నాకు సినిమానే ప్రపంచం .. ఏ పాత్ర ఇచ్చినా ఎంతో అంకితభావంతో చేస్తాను. అంతేగానీ ఎదుటివాళ్లను డామినేట్ చేయాలనే ఉద్దేశం నాకు ఎంత మాత్రం ఉండేది కాదు.

“ఒక రోజున వైజాగ్ లో షూటింగు .. నాలుగు పేజీల సీన్ ను సన్ సెట్ నేపథ్యంలో సింగిల్ టేక్ లో చేయాలి .. లేదంటే మళ్లీ మరుసటి రోజు ఆ సమయానికే షూటింగ్ అన్నారు. సీన్ లో డైలాగ్స్ అన్నీ నాకే ఉన్నాయి. సింగిల్ టేక్ లో ఆ సీన్ చేశాను ..  సూపర్ అంటూ అందరూ చప్పట్లు కొట్టేసి అభినందించారు. హీరోగారు మాత్రం చాలా ఫీలైపోయారు .. ఆయనని డామినేట్ చేస్తున్నానని ఫీలయ్యారు. అంతే .. ఆ సీన్ సినిమాలో లేకుండగా చేసేశారు. ‘అంత గొప్ప సీన్ తీసేశారేంటయ్యా’ అని అడిగితే .. ‘హీరోగారు లేపేయమన్నారు సార్’ అని చెప్పారు. అందరు అని చెప్పను గానీ కొంతమంది హీరోల విషయంలో ఇలాంటి అనుభవాలు నాకు చాలానే జరిగాయి” అని చెప్పుకొచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here