నిన్న తూత్తుకుడిలో  వేదాంత గ్రూప్ ఆధ్వర్యంలోని స్టెరిలైట్ కంపెనీని మూసివేయాలని   నిరసనలు పతాక స్థాయికి చేరి కాల్పులలో 11 మంది మరణించిన విషయం తెలిసినదే. క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంలో ప్రముఖ నటుడు కమల్ హాసన్ క్షతగాత్రులను పరామర్శించేందుకు వెళ్ళారు.  కాని 144 సెక్షన్ అమలులో ఉన్న ప్రదేశానికి వెళ్ళినందుకు కమల్ హాసన్ పై పోలీసులు కేసు నమోదు చేసారు .

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ప్రాణాలకు విలువ లేకుండా పోయిందన్నారు. కాల్పులకు కారణము ఎవరనే దానిపై ప్రజలు సమాధానాలు కోరుకుంటున్నారన్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments