జనసేన పోరాట యాత్ర నాల్గోవ రోజులో భాగంగా శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని అంబేద్కర్ జంక్షన్ నుండి ఇందిరా గాంధీ జంక్షన్ వరకు అభిమానులు, జనసేన కార్యకర్తలతో కలిసి పవన్ కళ్యాణ్ నిరసన కవాతులో పాల్గొన్నారు. అనంతరం ఇందిరా గాంధీ జంక్షన్ వద్ద బహిరంగ సభలో మాట్లాడుతూ ఉత్తరంధ్ర వెనకబాటు తనం వల్లనే ఎక్కడెక్కడికో,పరాయి ప్రదేశాలకి వలస వెళ్ళవలసి వస్తోంది, అందుకే జాతీయ, రాష్ట్ర ప్రబుత్వం వైఖరికి నిరసనగా  కవాతు నిర్వహిస్తున్నామన్నారు. తాను రాజాకేయాలలోకి అధికారం కోసం వస్తే ఎప్పుడో పదవులు సంపాదించేవాడినని, కాని తాను వచ్చింది రాజకీయ మార్పు కోసమని పవన్ అన్నారు. జనసేన ఒక రాజకీయ విప్లవానికి నాంది పలికిందన్నారు.

పవన్ మాట్లాడుతూ ప్రత్యేక హోదా విషయంలో మొదటినుంచి జనసేన పోరాడుతోంది కాని తెలుగుదేశం తమ పోరాటానికి తూట్లు పొడిచిందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం తమ ప్రతీ పోరాటంలో అడ్డు తగులుతోందని, ఎక్కడికక్కడ సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తోందన్నారు. ఇప్పుడేమే ధర్మ పోరాట దీక్ష పేరుతో ప్రజల సానుభూతి కొరకు దొంగ దీక్షలు చేస్తున్నారన్నారు. ఇంకా మాట్లాడుతూ చంద్రబాబు గారు, మీరు ప్రత్యేక హోదా రాకుండా చేసి, నిధులు తీసుకురాకుండా ఇప్పుడు ధర్మ పోరాట దీక్ష చేయడం చిల్లు పడిన కుండలా ఉందని పవన్ విమర్శించారు.

ముఖ్యంగా ఉత్తరాంధ్రలో దశాబ్దాలుగా సమస్యలు ఉన్నా పరిష్కరించే దిశగా ఒక ప్రయత్నం కూడా ప్రభుత్వం చేయడం లేదన్నారు.  కనీసం రాష్ట్రానికి వైద్య శాఖ మంత్రి కూడా లేరు అంటే ప్రజల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం అర్ధం చేసుకోవచ్చన్నారు. ప్రత్యేక హోదా ఏమైనా సంజీవినా అన్న ముఖ్యమంత్రి నేడు ధర్మ పోరాట దీక్ష పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. కనీసం కొన్ని ప్రాంతాలలో ప్రాధమిక వైద్యశాలలలో ఒక్క డాక్టర్ కూడా లేరని అన్నారు . తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదని కానీ ఏవిధంగా అభివృద్ధి చేస్తారనేది ముఖ్యమన్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments