అక్కినేని మూడు తరాల హీరోలతో తెరకెక్కిన చిత్రం మనం రిలీజ్ అయ్యి నేటికి నాలుగేళ్ళు. ఇది తెలుగు సినీపరిశ్రమ అగ్రనటులు అక్కినేని నాగేశ్వరరావు చివరి సినిమా . ఆరోజ్యం క్షీనించినా చివరి క్షణం వరకు నటిస్తూనే ఉండాలన్న దృఢ సంకల్పంతో ఈ సినిమాను పూర్తి చేసారు ఏఎన్నార్.
మనం సినిమా నేటికి విడుదలై నాలుగేళ్ళు అయిన సందర్భంగా నాగార్జున ట్వీట్ చేసారు. “మనం సినిమా రిలీజ్ అయ్యి నాలుగేళ్ళు. నేనెప్పుడు అదే ఆలోచిస్తుంటా. మీరు మమ్మల్ని ఏడిపించి, నవ్వించి జీవితాన్ని చావును ఎదుర్కొనే ధైర్యాన్ని ఇచ్చారు. మేం ఎప్పుడు మీ గురుంచే ఆలోచిస్తుంటాం నాన్న” అని నాగ్ ట్వీట్ చేసారు.