అలనాటి తార సావిత్రి జీవిత కధ ఆధారంగా తెరకెక్కిన చిత్రం “మహానటి” . ఈ చిత్రంలో మధురవాణి అనే జర్నలిస్ట్ పాత్రలో సమంత నటించారు. ఈ పాత్ర ద్వారానే సావిత్రి జీవితచరిత్రలోకి ప్రేక్షకులు ఎంటరవుతారు. 1980 ల నాటి వేషదారణతో మధురవాణిగా సమంత నటన చూసి ప్రేక్షకులు ప్రశంసించారు.
ఈ నేపధ్యంలో సమంత పాత్రకు సంబంధించిన మేకింగ్ వీడియో ను చిత్ర బృంద్రం విడుదల చేసింది. మేకింగ్ వీడియో లో సమంత – విజయ్ దేవరకొండ కాంబినేషన్లో ఉన్న సీన్స్ చిత్రీకరణ సందర్భంలోని షాట్స్ ఉన్నాయి. ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది .