కర్ణాటక సీఎం గా కుమారస్వామి…

0
310

కర్ణాటక 24 వ ముఖ్యమంత్రి గా హెచ్. డి. కుమారస్వామి విధాన సభా ప్రాంగణంలో ప్రమాణస్వీకారం చేశారు. ఉపముఖ్యమంత్రిగా డా జి పరమేశ్వర ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ వాజుభాయ్ రాధాభాయ్ వాలా ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి  చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ,రాహుల్ గాంధీ, యూపీ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ  అధ్యక్షులు అఖిలేష్ యాదవ్, తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారం ఏచూరి, జైపాల్ రెడ్డి,  ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here