మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుండి మరో హీరో కళ్యాణ్ దేవ్(శ్రీజ భర్త) వెండితెరకు పరిచయం అవ్వబోతున్న విషయం తెలిసినదే . ప్రముఖ చలన చిత్ర సంస్థ వారాహి ద్వారా హీరోగా కళ్యాణ్ పరిచయం అవుతున్నారు. చిరంజీవి సినీ కెరీర్ లో మైల్ స్టోన్ లాంటి సినిమా విజేత, ఆ సినిమా టైటిల్ నే కళ్యాణ్ దేవ్ మూవీకి టైటిల్ గా ఎంచుకున్నారు . దీనికి సంబందించిన పోస్టర్ చిత్రబృండం రిలీజ్ చేసింది.

ఈ పోస్టర్ లో ఓ చిన్నారి చేతిని పట్టుకున్న హీరో చేతిని చూపించారు. పోస్టర్ పై రాసి ఉన్నదాన్ని గమనిస్తే ఈ సినిమా స్టొరీ లైన్ తెలుస్తుంది. పక్క వారి మోహంలో సంతోషం నింపడం కూడా మనం సాదించే విజయమే అని పోస్టర్ పై రాసి ఉంది. ఈ సినిమాలో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తుండగా రాకేశ్ శశి దర్సకత్వం వహిస్తున్నారు.  ఈ సినిమాకి సెంధిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తుండగా రజనీ కొర్రపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హర్షవర్ధన్ పరమేశ్వర్ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments