సినిమా నిడివి ఎక్కువగా ఉన్నా కంటెంట్ ఉంటే ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చెస్తున్నారు. దానికి రంగస్థలం,మహానటి, భరత్ అనే నేను వంటి సినిమాలే ఉదాహరణ. వీటి నిడివి రెండున్నర గంటల పైమాటే. ఇప్పుడు ఈ కోవలోకి కాలా వచ్చి చేరింది. రజనీకాంత్ హీరోగా కబాలి ఫేం పా రంజిత్ దర్సకత్వంలో హీరో ధనుష్ నిర్మాణంలో రూపొందిన చిత్రం “కాలా”.

కాలా చిత్రం నిడివి 2 గంటల 46 నిమిషాల 59 సెకన్లు .  ఈ సినిమా సెకండాఫ్‌లో రజనీ రౌడీయిజం, డైలాగ్స్‌ సూపర్బ్‌గా ఉంటాయట. అందుకే కాలా టీమ్‌ నిడివి తగ్గించేందుకు రాజీ పడలేదని టాక్‌. నానా పటేకర్‌ కీలక పాత్ర చేసిన ఈ సినిమాలో అంజలీ పాటిల్, హ్యూమా ఖురేషీ కథానాయికలు. ఈ సినిమా జూన్‌ 7న విడుదల కానుంది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments