డ్రైవర్ రాముడు అన్న పేరు వినగానే స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు నటించిన సినిమానే గుర్తొస్తుంది. ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో సూపర్ హిట్ సినిమా. ఇప్పుడు అదే పేరుతో కమెడియన్ శకల శంకర్ కధానాయకుడిగా ఒక సినిమా రూపొందుతోంది. రాజ్ సత్య దర్సకత్వం వహిస్తున్న ఈ సినిమాను పీపుల్ పాతకంపై మాస్టర్ ప్రణవ్ తేజ్ సమర్పణలో వేణుగోపాల్‌ కొడమగుళ్ల, ఎమ్‌.ఎల్‌. రాజు, ఆర్‌.ఎస్‌. కిషన్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ చిత్రంలో ఆంచల్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ను హీరో సుధీర్ బాబు  చేతుల మీదగా విడుదల చేశారు చిత్రబృందం.

ఈ సందర్భంగా సుధీర్‌ బాబు మాట్లాడుతూ – ‘‘ఏ సినిమాలో అయినా షకలక శంకర్ ఉన్నాడంటే ఆ సినిమాలో కామెడీ బావుంటుంది. ఇప్పుడు అతను హీరోగా చేస్తున్నాడంటే ఆ సినిమా ఎంత వినోదాన్ని పంచుతుందో ఊహించవచ్చు. ఈ చిత్రదర్శక–నిర్మాతలకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. రాజ్‌ సత్య మాట్లాడుతూ – ‘‘డ్రైవర్‌ రాముడు’ చిత్రం ద్వారా శంకర్‌లోని మరో కోణాన్ని, ఆయన మార్క్‌ కామెడీనే కాకుండా, ప్రేక్షకులకు కనెక్ట్‌ అయ్యే ఓ ఎమోషనల్‌స్టోరీని చూపించబోతున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సునీల్‌ కశ్యప్, ఆర్ట్‌: రఘు కులకర్ణి.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments