తెలుగు సినీ ఇండస్ట్రీ లో ఇప్పుడున్న యువ హీరోలల నితిన్ ఒకరు. ఈమధ్య వరుస అపజయాలతో ఉన్న నితిన్ ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నారు. అందుకే ఆయన దిల్ రాజు – సతిశ్ వేగేశ్న కాంబినేషన్లో శ్రీనివాస కల్యాణం చేస్తున్నారు.
ఇప్పుడు ఈయన గురుంచి టాలీవుడ్ లో ఒక వార్త విన్దపడుతోంది. అదేంటంటే నితిన్ శ్రీనివాస కల్యాణం షూటింగ్ లో పాల్గొంటూ మరో వైపు దర్శకుడు డాలీ(కిషోర్ కుమార్ పార్థసాని) దర్సకత్వంలో ఒక సినిమా చేయడానికి ఒకే చెప్పినట్లుగా తెల్సుతోంది. డాలీ గతంలో గోపాల గోపాల, కాటమరాయుడు చిత్రాలకు దర్సకత్వం వహించారు. ఆయన నితిన్ కి వినిపించిన కధ కొత్తగా ఉందనీ, ఇంతవరకూ నితిన్ చేయని పాత్రని సమాచారం. త్వరలోనే ఈ సినిమా పై అధికారిక ప్రకటన వెలువడనుంది.