కర్ణాటక ఎన్నికలు ముగిసిన తరువాత పెట్రోల్, డీజిల్ ధరలు రోజూ పెరుగుతూ వస్తూ రూ. 80 దాటిపోయాయి. దీనితో దేశవ్యాప్తంగా ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్ ధరలు నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమయ్యిందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

తాజాగా ఈ విషయం పై కేంద్ర మాజీ ఆర్ధిక మంత్రి చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు .  పెట్రోల్ ధరలను రూ. 25 వరకు తగ్గించే అవకాశం ఉన్నప్పట్టికీ కేంద్ర ప్రభుత్వం కేవలం రూ. 1 లేదా 2 తగ్గించి ప్రజలను మోసం చేస్తోందని అన్నారు. ఖజానాను నింపుకునేందుకు సామాన్యులపై కేంద్ర ప్రభుత్వం భారం మోపుతోందని అన్నారు .  ముడిచమురు ధరలు తగ్గినపుడు పెట్రోలు ధరలను లీటరుకు రూ. 15 వరకు తగ్గించవచ్చని , ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం అదనపు పన్ను రూపంలో వసూలు చేస్తున్న మొత్తాన్ని తగ్గించడం ద్వారా మరో రూ. 10 తగ్గించవచ్చని , మొత్తం మీద రూ. 25 వరకు తగ్గించవచ్చని తెలిపారు . పెట్రో ధరలను తగ్గించే అవకాశం ఉన్నప్పటికీ కేంద్రం మాత్రం ఆదాయం గురుంచే ఆలోచిస్తోందని విమర్శించారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments