తిరుమల మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు టీటీడీ వేటు వేసినప్పటి నుంచి టీటీడీ పై అనేక ఆరోపణలు వస్తున్నాయ్ . రమణ దీక్షితులు, టీటీడీ మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు ఉదృతం అవుతోంది . ఈ విష్యం పై చాలా మంది చాలా రకాలుగా స్పందిస్తున్నారు. తాజాగా విజయవాడలో తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతిష్ఠను రాష్ట్ర ప్రభుత్వం దిగాజారుస్తుందని ఆరోపిస్తూ బ్రాహ్మణ ఐక్య వేదిక ఆధ్వర్యంలో శాంతి యాత్రను చేపట్టారు. బెంజీ సర్కిల్ లోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయం నుంచి కనకదుర్గమ్మ ఆలయం వరకు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ ఐక్య వేదిక ప్రతినిధులు మాట్లాడుతూ చంద్రబాబు సర్కార్ హిందూధర్మం పై దాడికి దిగిందని, బ్రాహ్మణ సామాజిక వర్గం పై కక్ష సాదింపులకు పాల్పడుతోంది ఆరోపించారు. అర్చక వృత్తిని దెబ్బతీసేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రమణ దీక్షితుల విషయంలో ప్రభుత్వ వైఖరి దారుణమని, రాష్ట్ర ప్రభుత్వం స్వామి వారి ప్రతిష్టను దెబ్బతీసేలా నిర్ణయాలు తీసుకుంటోందని మండిపడ్డారు. ఈ వైఖరికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేస్తామని అన్నారు.
హిందూ ధర్మం పై చంద్రబాబు సర్కార్ దాడి…
Subscribe
Login
0 Comments