బీజేపీ సీనియర్ నేత,కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ఏకైక కుమారుడు వైష్ణవ్(21) గుందేపోటుతో మరణించాడు. మంగళవారం రాత్రి 10 గం 45 నిమిషాల సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేస్తుండగా గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే అతడిని ముషీరాబాద్ గురునానక్ కేర్ ఆఉపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అర్ధరాత్రి 12 గం 30 నిమిషములకు వైష్ణవ్ మృతి చెందాడు. వైష్ణవ్ ను కాపాడేందుకు ఎంత ప్రయత్నం చేసినా ఫలించలేదని వైద్యులు తెలిపారు. వైష్ణవ్ ప్రస్తుతం ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఈ సంఘటనతో  దత్తాత్రేయ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. విషయం తెలిసిన పలువురు నేతలు దత్తాత్రేయను పరామర్శించారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments