తెలంగాణ ప్రభుత్వం పరిపాలనలో వికేంద్రీకరణ సూత్రాన్ని బలంగా నమ్ముతుందని, పాలన వికేంద్రీకరణ ద్వారా ప్రజలకు ప్రభుత్వ పథకాలు మరింత వేగంగా చేరుతాయని మున్సిపల్ శాఖ మంత్రి కెటి రామారావు అన్నారు. ఈ రోజు సచివాలయంలో తెలంగాణ మున్సిపల్ కమిషనర్ల డైరీ ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చరిత్రలో ఎన్నడు లేని విధంగా రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలకు, కార్పోరేషన్లకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించామని అన్నారు. పట్టణాల్లో ఇప్పటికే అర్బన్ మిషన్ భగీరథ ద్వారా రూ. 4,500 కోట్ల నిధులు ఖర్చు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.
Subscribe
Login
0 Comments