సీఎం చంద్రబాబుపై బీజేపీ నేత సోమువీర్రాజు మళ్లీ విమర్శలు గుప్పించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘జగన్మోహన్ రెడ్డి, పవన్ కల్యాణ్ లను బీజేపీ నడిపిస్తుంటే..మరి, నలభై ఏళ్ల అనుభవమున్న చంద్రబాబు.. మీరెవరిని నడిపిస్తున్నారు? ఏపీ ప్రజలను గాలికొదిలేశారు’ అని బీజేపీ నేత సోము వీర్రాజు ప్రశ్నించారు. దేశ, కర్ణాటక రాజకీయాలతోనే కాలం గడుపుతున్నారని, సాధికారి సభల్లోనూ రాజకీయాలే ప్రస్తావిస్తున్నారంటూ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు ప్రభావం కర్ణాటక ఎన్నికల్లో ఉంటే బీజేపీకి 25 శాతం నుంచి 35 శాతం ఓట్లు సాధించిందని ప్రశ్నించారు. డిపాజిట్లు కోల్పోయిన పార్టీ నేత ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు చంద్రబాబు ఉవ్విళ్లూరుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి జీవించే సంస్కృతి చంద్రబాబుదని, దీక్షల పేరిట ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. నాడు వాజ్ పేయి ప్రభుత్వాన్ని పడగొట్టి దేవేగౌడకు మద్దతిచ్చారని, విద్యను కార్పొరేట్ స్కూళ్లకు అప్పగించారంటూ మండిపడ్డారు. ఈ సందర్భంగా తిరుమలలో జరుగుతున్న పరిణామాలను  ఆయన ప్రస్తావించారు. ‘ అమిత్ షాను రమణదీక్షితులు కలవడాన్ని తప్పుపడతారా?టీటీడీ పరిపాలన చేసేది ఈవో సింఘాలా? ఐఎఎస్ అధికారి రాజు గారా? ఎవరి సహకారంతో రాజు పరిపాలన సాగిస్తున్నారు. తిరుపతిలో ఎల్ 1, ఎల్ 2 సేవలు ఎవరికి అమ్ముతున్నారు?’ అని ప్రశ్నించారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments