మెహబూబా చిత్ర ఫలితంతో ఢీలా పడిపోకుండా తన తర్వాతి ప్రాజెక్టు పనిలో దర్శకుడు పూరి జగన్నాద్  మునిగిపోయారు. తనయుడు ఆకాశ్‌తోనే తర్వాతి చిత్రం తీసేందుకు దాదాపు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే ఈ మధ్యలో ఓ స్టార్‌ హీరోకు ఓ కథను వినిపించి ప్రాజెక్టును ఖరారు చేసుకున్నాడనే వార్త చక్కర్లు కొడుతోంది.

మెహబూబా చిత్ర విడుదలకు ముందే నాగార్జున అక్కినేనికి ఓ కథను వినిపించారంట. ఎమోషనల్‌ కంటెంట్‌తో ఉన్న ఆ కథ నచ్చటంతో నాగ్‌ ఓకే చేశాడని, పైగా నాగ చైతన్యతో అది మల్టీస్టారర్‌గా తెరకెక్కించబోతున్నాడని ఆ కథనం సారాంశం. మెహబూబా ఫలితంతో సంబంధం లేకుండా మరీ ఆ ప్రాజెక్టును నాగ్‌ కమిట్‌ అయినట్లు ఆ వార్త ఉటంకించింది. అయితే నానితో చేస్తున్న మల్టీస్టారర్‌, బంగార్రాజు ప్రాజెక్టు పూర్తయ్యాక పూరీతో మల్టీస్టారర్‌ ప్రారంభిస్తారంట. దీనిపై అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ వెలువడాల్సి ఉంది.

గతంలో పూరీ-నాగ్‌ కాంబోలో శివమణి, సూపర్‌ చిత్రాలు వచ్చాయి. దాదాపు దశాబ్దం గ్యాప్‌ తర్వాత వీళ్లు మళ్లీ జత కడుతున్నారని, ముఖ్యంగా వరుస ఫెయిల్యూర్స్‌తో ఉన్న పూరీకి నాగ్‌ ఛాన్స్‌ ఇవ్వబోతున్నాడన్న వార్త ఆసక్తికరంగా మారింది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments