టీటీడీ వివాదం రోజురోజుకి ముదిరి పాకాన పడుతోంది . ఈ విషయం పై అనేకమంది అనేకరకాలుగా స్పందిస్తున్నారు. ఇప్పుడు ఈ విషయం పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. పోరాట యాత్ర మూడవ రోజులో భాగంగా ఈరోజు ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు.

పవన్ టీటీడీ వివాదంపై స్పందిస్తూ దాదాపు 25 సంవత్సరాలకు పైగా శ్రీ వెంకటేశ్వరస్వామీ సేవలో ఉన్న వ్యక్తి అధికారుల వైఖరి,చేస్తున్న తప్పులపై ఆరోపణలు చేస్తుంటే వాటిపై విచారణ జరిపించాలసిన బాధ్యత ప్రభుత్వానికి లేదా..? అని చంద్రబాబును ఉద్దేశించి ప్రశ్నించారు. గతంలో ఎన్నోసార్లు రమణ దీక్షితులు ఆశీర్వచనాలు పొందిన చంద్రబాబు ఇప్పుడు రాజకీయ కారణాలు,వ్యక్తిగత ప్రయోజనాలు,తమవారి ప్రయోజనాలన కొరకు రమణ దీక్షితులును  బలి చేశారని  అనిపిస్తోందన్నారు. టీటీడీ లో జరుగుతున్న అక్రమాలపై భక్తులకు అనుమానాలు ఉన్నాయని,వాటిని నివృత్తి చేయవలసిన బాధ్యత చంద్రబాబుదేనని అన్నారు. టీటీడీ పై వస్తున్న ఆరోపణలపై త్వరగా నిజనిజాలాను నిగ్గుతేల్చాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేసారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments