జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పోరాట యాత్ర మూడవ రోజులో భాగంగా పలాసలో హరిశంకర్ థియేటర్ నుంచి కాశిబుగ్గ బస్టాండ్ వరకు అభిమానులు,జనసేన కార్యకర్తలతో కలిసి నిరసన కవాతులో పవన్ పాల్గొన్నారు. కవాతు ముగిసిన తరువాత కాశిబుగ్గ బస్టాండ్ వద్ద పవన్ ప్రసంగిస్తూ ఎక్కడైన్తే దోపిడీ రాజకీయ వ్యవస్థ ఉంటుందో, ఎక్కడైతే దౌర్జన్యం ఉంటుందో అక్కడ కచ్చితంగా తిరుగుబాటు ఉంటుందన్నారు. శ్రీకాకుళం జిల్లా వెనక బడిన జిల్లాగా ఉండడానికి కారణం పాలకులేనని అన్నారు. జిల్లాలో మొత్తం 192 కిలోమీటర్ల తీరప్రాంతం ఉందని . గత ఎన్నికల ప్రచారంలో శ్రీకాకుళం ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని, తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కలిగిస్తామని చంద్రబాబు అన్నారని, కానీ తరువాత మాట మార్చారని అన్నారు. ఉద్దానం వంటి సమస్యలు కూడా చాలా ఉన్నాయని,తాను అమెరికా నుండి డాక్టర్లను తీసుకువచ్చినా ప్రభుత్వం స్పందించలేదన్నారు.ఎదో తూతూ మంత్రంగా రెండు డైయాలసిస్ సెంటర్లు పెట్టి ఊరుకున్నారన్నారు . ప్రతీ నియోజికవర్గం కనీసం ఒక డాక్టర్ కూడా లేరని వాపోయారు.
పవన్ మాట్లాడుతూ తిరుగుబాటు చేసిన నేల మన శ్రీకాకులమని,రక్తం చిందించదానికి కూడా వెనకాడదని అని అలాంటి నెల నుండి పోరాటం ప్రారంభించామన్నారు. రాజకీయ వ్యవస్థ కుల్లిపోతోందని, ఈ పరిస్థతి చూస్తే తనకు ఒక్కటే గుర్తుకువస్తోందని యువతరానికి ఏమి మిగిల్చారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. యుద్ధాలు,రక్తాలు,కన్నీరు,కలలు,మోసాలు తప్ప ఏం ఇచ్చారని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ విధంగా చాలా రోజులనుండి అన్యాయం జరుగుతోందని, జరుగుతున్న అన్యాయానికి తాను వ్యతిరేకంగా గళమెత్తానని అన్నారు. దశాబ్దాల పాటు మన పాలకులు చేసిన తప్పులకు మనం ఇప్పుడు సమస్యలు ఎదురుకుంటున్నామన్నారు.