కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని టీడీపీ సారధ్యంలో ధర్మపోరాట సభలు నిర్వహిస్తున్న విషయం తెలిసినదే. ఈరోజు విశాఖపట్నంలో ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ధర్మ పోరాట సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన మనం కోరుకున్నది కాదని, విభజన తరువాత నష్టపోయిన రాష్ట్రానికి మేలు జరుగుతుందనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు బీజేపీ తో పొత్తు పెట్టుకున్నారన్నారు. నాలుగేళ్ళు చాలా ఒపికపెట్టామన్నారు. మొదటి ఏడాది ప్రత్యేక హోదా ఇస్తామని, రెండో ఏడాది ఇదిగో ఇస్తున్నాం అని, మూడో ఏడాది ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వట్లేదని, చివరిగా నాలుగో ఏడాది మనరాష్ట్రానికి నమ్మకద్రోహం చేశారన్నారు. ఈ విధంగా బీజేపీ మిత్ర ధర్మానికి వెన్నుపోటు పోడిచిందన్నారు. విభజన వాళ్ళ ఏపీ లో లోటు బడ్జెట్ ఉందని, అయినప్పటికీ అనింటినీ అధిగమించి చంద్రబాబు రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళుతున్నారని అన్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments