రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు భిన్నంగా ప్ర‌యోగాలు చేస్తూ అల‌రిస్తుంటాడు మంచు  మ‌నోజ్‌.  మంచు మ‌నోజ్ పుట్టిన‌రోజు, పెళ్లి రోజు వేడుకుల‌ను ఈ ఆదివారం మే 20 ణ  సెల‌బ్రేట్ చేసుకున్నాడు. ఈ సంద‌ర్భంగా మంచు మ‌నోజ్‌కు సినీ ప్ర‌ముఖుల‌తోపాటు ఆయ‌న అభిమానులు కూడా విషెస్ తెలియ‌జేశారు.
అభిమానుల నుంచి వ‌చ్చిన విషెస్‌లో ఓ వీడియో మ‌నోజ్‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. మ‌నోజ్ కెరీర్‌లోని విజ‌యాల‌తోపాటు అప‌జ‌యాల‌ను కూడా ప్ర‌స్తావిస్తూ కొంద‌రు ఓ రివ్యూ వీడియోను రూపొందించారు. ఈ వీడియో మ‌నోజ్‌కు చాలా న‌చ్చింది. దాని గురించి మ‌నోజ్ ట్వీట్ చేశాడు. `ఈ వీడియో ఎవ‌రు రూపొందించారో గానీ.. న‌న్ను చంపేశారు. నేను అందుకున్న ఉత్త‌మ‌మైన పుట్టిన‌రోజు కానుక ఇదే. ఇది రూపొందించినందుకు చాలా ధ‌న్యవాదాలు. క‌ష్ట‌ప‌డి మంచి సినిమాలు చేస్తా. మిమ్మ‌ల్ని హృద‌య‌పూర్వకంగా ప్రేమిస్తున్నా` అంటూ మ‌నోజ్ ట్వీట్ చేశాడు.
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments