కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్న హెచ్. డి . కుమారస్వామిని అభినందించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు సాయంత్రం ప్రత్యేక విమానంలో బెంగళూరు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని దేవేగౌడ తో సమావేశం కానున్నారు. మళ్ళీ తిరిగి రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారు. రేపు కొన్ని అత్యవసర సమావేశాలు ఉన్నందున ఆయన కుమారస్వామి ప్రమాణస్వీకారం వరకు బెంగళూరులో ఉండలేకపోతున్నారు. ఆయనతో పాటు పలువురు ఎంపీలు, రాష్ట్ర మంత్రులు కూడా బెంగళూరు వెళ్లనున్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments