ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో “అరవింద సమేత వీర రాఘవ” సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసినదే . ఈ సినిమా షూటింగ్ చకచకా జరిగిపోతోంది . ఈ సినిమాలో ఎన్టీఆర్ రాయలసీమ యాసలో మాట్లాడనున్నారు. ఈ చిత్రం లో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇటీవలే ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యి ప్రేక్షకుల నుండి మంచి స్పందన పొందింది.
కధ ప్రకారం మరో హీరోయిన్ కూడా అవసరం కావడంతో తెలుగు మాట్లాడే హీరోయిన్ అయితే బాగుంటుందని త్రివిక్రమ్ భావించారట. వెంటనే ఆయనకు “అమీ తుమీ ” సినిమాలో హీరోయిన్ గా నటించిన అచ్చ తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా ను ఎంపిక చేసినట్లుగా సమాచారం. ఈ సినిమాలో ఈషా పాత్ర ద్వారా ఆమె నటనలో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తారని ఫిలిం నగర్ వర్గాల టాక్. త్రివిక్రమ్ దర్సకత్వంలో ఎన్టీఆర్ పక్కన నటించే అవకాశం రావడంతో ఈషా రెబ్బా చాలా ఆనందంతో పొంగిపోయారట.