ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు బాబీ మద్యం మత్తులో కారును ఢీకొట్టి పరారయ్యారు. హర్మీందర్ సింగ్ అనే వ్యక్తి ఈ సంఘటన గురుంచి ఫేస్బుక్ లో చేసిన పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది. వివారాల్ల్లోకి వెళితే ఆదివారం రాత్రి అయ్యప్ప సోసిటీ లో శుభకార్యానికి వెళ్లి కుటుంబంతో తిరిగి వస్తుండగా సరిగ్గా జుబ్లీహిల్ల్స్ రోడ్డు నెంబర్ ౩౩లోని కేఫ్ అబ్బాట్ వద్దకు రాగానే అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకల్లో పాల్గొని వస్తున్న దర్శకుడు బాబీ ప్రయాణిస్తున్న ఎరుపు రంగు వోల్వో కారు తమ ఐ10 కారును వెనుక నుండి ఢీకొట్టిందని హర్మీందర్ సింగ్ పేర్కొన్నారు. ఈ ఘటనలో తమ కారు ద్వంసమైందన్నారు . ఆ సమయంలో బాబీ మద్యం సేవించి ఉన్నారని,ఈ విషయం పై తాను నిలదీయగా బాబీ తన ఇల్లు ఇక్కడే ఉందని మాట్లాడుకుందామంటూ క్షణాల్లో అక్కడి నుంచి ఉడాయించారన్నారు. ఇంత పెద్ద తప్పు చేసి కూడా కనీసం తనకు క్షమాపణ చెప్పకుండా పరారయ్యారన్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసానని హర్మీందర్ తెలిపారు. ఈ విషయం పై కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Subscribe
Login
0 Comments