భారతదేశం లో పోలీసు వ్యవస్థా బాగానే ఉన్నా కొన్ని ఉదంతాలు వారిపై ఉన్న గౌరవాన్ని పోగోడుతున్నాయి. తాజాగా అలాంటి సంఘటనే జరిగింది . కాకపోతే ఈ సంఘటన లో పోలీసు వలన బాధపడినది ఇండియన్ క్రికెట్ ప్లేయర్ జడేగా భార్య రీవా సోలంకి. వివరాల్లోకి వెళితే సోమవారం సాయంత్రం గుజరాత్ జామ్నగర్లో సారు సెక్షన్ రోడ్డులో రీవా సోలంకి ప్రయాణిస్తున్న కారు రాంగ్ రూట్లో వస్తున్న కానిస్టేబుల్ సంజయ్ అహీర్ ద్విచక్ర వాహనాన్ని స్వల్పంగా ఢీకొంది. దీనితో ఆగ్రహంతో కానిస్టేబుల్ అహిర్ కార్ వద్దకు చేరుకొని ఆమెతో వాగ్వాదానికి దిగి ఆమెపై దాడి చేశాడు. ఒకానొక దశలో రీవాను జుట్టు పట్టుకొని కొట్టడానికి ప్రయత్నించగా అక్కడ ఉన్న స్థానికులు అడ్డుకున్నారు. దీనితో ఆమెకు స్వల్ప గాయాలయినట్టు జామ్ నగర్ ఎస్పీ ప్రదీప్ సేజుల్ తెలిపారు. దాడికి దిగిన కానిస్టేబుల్ పై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.
జడేజా భార్యపై కానిస్టేబుల్ దాడి…
Subscribe
Login
0 Comments