తెలుగు సినీ ఇండస్ట్రీ లో ఇప్పుడు బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. అలనాటి నటి సావిత్రి బయోపిక్ మహానటి విడుదలై ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందుతోంది . ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ యాత్ర పేరుతో రూపొందుతున్న విషయం తెలిసినదే . ప్రముఖ మళయాళ నటులు మమ్ముట్టి వై ఎస్ పాత్రలో నటిస్తున్నారు. . ఈ సినిమాకు మహి వి రాఘవ దర్సకత్వం వహిస్తున్నారు.
ఇప్పుడు ఉన్న తాజా సమాచారం ప్రకారం వై ఎస్ కూతురు షర్మిల పాత్రలో భూమిక నటించనున్నారు. వై ఎస్ విజయమ్మ పాత్రలో పాత్రలో ఆశ్రిత వేముగంటి నటిస్తున్నారు. వై ఎస్ రాజశేఖర్ రెడ్డి అత్యంత విశ్వాస పాత్రుడైన సూరీడు పాత్రల పోసాని కృష్ణమురళి నటిస్తున్నారు. మరి కీలకమైన జగన్ పాత్రలో ఎవరు నటిస్తున్నారనేది ఇంకా తెలియలేదు.