తెలుగు సినీ ఇండస్ట్రీ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, అనుష్క జోడి గురుంచి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు . వీరిద్దరూ మంచి స్నేహితులు . వీళ్ళు ప్రేమలో ఉన్నారని,త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు వీళ్ళిద్దరి గురుంచి మరో న్యూస్ హల్చల్ చేస్తోంది.
అసలు విషయం ఏమిటంటే ప్రభాస్ తన సినిమా “సాహో” షూటింగ్ నిమిత్తం దుబాయ్ కు వెళ్ళిన సంగతి తెలిసినదే. అక్కడ రిస్కీ షాట్స్ చేస్తూ ప్రభాస్ రెండు మూడు సార్లు గాయపడ్డారు. ఈ విష్యం తెలుసుకొని అనుష్క హుటాహుటిన దుబాయ్ వెళ్లి అక్కడ ప్రభాస్ కు గంట పాటు క్లాసు తీసుకున్నారట . రిస్కీ ఫైట్ల షూటింగ్ సమయంలో దూప్ ను పెట్టుకోమంటూ గట్టిగా చెప్పారట . ప్రభాస్ అనుష్క చెప్పిందంతా విని అలాగే దూప్ ను పెట్టుకుంటానంటూ వాగ్దానం చేశారట.