ఈ నెల 27 నుండి మూడు రోజుల పాటు విజ‌య‌వాడ‌లో జ‌ర‌గ‌నున్న తెలుగుదేశం పార్టీ మ‌హానాడులో 36 తీర్మానాలు ఉంటాయ‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు తెలిపారు. ఈ విష‌య‌మై మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడ అధ్య‌క్ష‌త‌న తెలుగుదేశం పార్టీ మహానాడు తీర్మానాల కమిటీ సోమవారం సమావేశ‌మైంది. ఈ సమావేశంలో ప్రధానంగా మహానాడులో ప్రవేశ‌పెట్టే తీర్మానాలకు సంబంధించి చర్చించారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ, ఆర్థిక పరిస్థితులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలు, కేంద్రప్రభుత్వ వైఖరి, నోట్ల రద్దు, జీఎస్టీ అమలు వంటి అంశాలపై చర్చించారు. మహానాడులో మొత్తం 36 ప్రవేశ‌పెట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబందించి 24 తీర్మానాలు, తెలంగాణకు సంబందించి 8, రెండు రాష్ట్రాలకు సంబందించి ఉమ్మడిగా 4, ఒక రాజకీయ తీర్మానం ప్రవేశ‌పెట్టాలని నిర్ణయించినట్లు మంత్రి యనమల పేర్కొన్నారు. ప్రధానంగా జాతీయ రాజకీయ టీడీపీ పాత్ర, ధర్మపోరాటం, కేంద్ర అనాలోచిత ఆర్థిక విధానాలు, ప్రజల విశ్వాసం కోల్పోతున్న బ్యాంకింగ్ వ్యవస్థ, జిఎస్టీ, నోట్ల రద్దు వైఫల్యాలు, సామాన్యుల బతుకుభారం, కేంద్ర పెత్తందారి పోకడలు, ప్రమాదంలో రాష్ట్రాల ఆర్థిక ప్రతిపత్తి, 15వ ఆర్థిక సంఘం విధివిధానాలు, అభివృద్ధికి అడుగడుగునా అడ్డం ప‌డుతూ విప‌క్షాలు క‌ల్గిస్తున్న ఆటంకాలు తదితర తీర్మానాలు మహానాడులో ప్రవేశ‌పెడతున్న‌ట్లు మంత్రి యనమల తెలిపారు. సమావేశంలో పి.క్రిష్ణ‌య్య, కుటుంబరావు, సాయిబాబు, పి.అనూరాధ, లంకా దినకర్, శోభారాణి, మల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.
కర్ణాటకలో ఎమ్మెల్యేలతో జరిపిన బేరసారాల ఆడియో టేపులపై కేంద్రం విచారణ జరపాలి…
కర్ణాటకలో ఎన్నికల ఫలితాలు తర్వాత గవర్నర్ భాజపాకు అధికారం ఇచ్చి 15రోజుల్లో బలనిరూపణ చేసుకోవాలన్న తర్వాత భాజపా కోనుగోళ్ళుకు దిగిందని బేరసారాల్లో బాగంగానే గాలి జనార్ధన్ రెడ్డి, శ్రీరాములు తదితరులు కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలతో ఫోన్ ద్వారా కోనుగోళ్ళుకు దిగారని యనమల రామకృష్ణుడు తెలిపారు. గాలి జనార్థన్ రెడ్డి ఫోన్ ద్వారా మాట్లాడిన ఆడియో టేపులు బ‌య‌టపడ్డాయ‌ని వాటి గురించి ఇప్పటివరకు భాజపా అధిష్టానం ఎందుకు స్పదించలేద‌ని ప్ర‌శ్నించారు. గాలి జనార్థన్ రెడ్డిని ఉపయోగించి బేరసారాలకు ప్రోత్సహించింది భాజపా కాదా..?, అవినీతిపరుడు, మైనింగ్ మాఫీయా డాన్ అయిన గాలి జనార్థన్ రెడ్డిని భాజపానే రక్షించడం వాస్తవం కాదా అని యనమల ప్రశ్నించారు. గాలి జనార్థన్ రెడ్ది ఫోన్‌లో జరిపిన బేరసారాలు ఆడియో టేపులు బ‌య‌టకు వచ్చాక భాజపా ఎందుకు మౌనంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి తెలంగాణలో టేపుల సంబాషణ గురించి తరుచు మాట్లాడతున్నారు గానీ గాలి జనార్థన్ రెడ్డి ఎమ్మెల్యేతో బేరసారాలు జరిపిన టేపులు బ‌యటకు వస్తే ఎందుకు మాట్లాడం లేద‌ని ప్ర‌శ్నించారు. క‌ర్ణాటకలో బైటపడ్డ ఆడియో టేపులపై భాజపా, జగన్, పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడం లేదు? దీనిపై ప్రజలు ఏమి అర్థం చేసుకోవాలన్నారు. గాలి జనార్థన్ రెడ్డి నీకు దేవుడిచ్చిన అన్న కాబట్టి అతని ఆడియో టేపులపై మాట్లాడవా..? ఎమ్మెల్యేలతో జరిపిన బేరసారాలపై ఆడియో టేపులపై కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా విచారణ జరిపి నిజనిజాలను చెప్పాల్సిన బాధ్య‌త‌ కేంద్రప్రభుత్వంపై ఉందని మంత్రి యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments