అర్జున్ రెడ్డి సినిమాతో అంతులేని స్టార్ డం ను ఆస్వాదిస్తున్నారు  విజయ్ దేవరకొండ.  ఈయన నటిస్తున్న చిత్రం టాక్సీవాలా . ఈ సినిమా ద్వారా రాహుల్ సాంకృత్యాన్ దర్శకుడిగా పరిచయమవుతుండగా ప్రియాంక జవాల్కర్,మాళవిక శర్మ లు కదానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం విడుదల అవ్వవలసి ఉండగా ఆలస్యమవుతూ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయ్.

ఈ సినిమాను వచ్చే నెల 15 న కాని,22 న కాని విడుదల చేయాలని దర్శక నిర్మాతలు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. సైంటిఫిక్ థ్రిల్లర్ గా ఈ సినిమా ఉంటుందని, ఒక టాక్షీవాలా కి దెయ్యానికి మధ్యసాగే కధగా ఈ సినిమా ఉంటుందని,ఈ సినిమాతో విజయ్ దేవరకొండ మళ్ళీ హిట్ కొట్టటం ఖాయమని ఫిలిం నగర్ వర్గాల టాక్.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments