మే 20 న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు అన్న విషయం తెలిసినదే. ఈ సందర్భంగా ఆయనకు చిత్ర పరిశ్రమలో ఉన్న వారినుండి,అభిమానులనుండి శుభాకాంక్షలు వెల్లువెత్తాయ్. మెగా పవర్ స్టార్ రామచరణ్ ఎన్టీఆర్ కు పుట్టిన శుభాకాంక్షలు తెలుపుతూ ఇద్దరు కలిసి దిగిన ఫోటో పోస్ట్ చేసి “బ్రదర్…హ్యాపీ బర్త్ డే. అద్బుతమైన సంవత్సరం నీ ముందుంది ” అని ట్వీట్ చేశారు. ఈ పోస్ట్ చూసి ఇటు నందమూరి అభిమానులు, అటు మెగా అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు. అయితే ఈ పోస్ట్ చూసిన రామ్ చరణ్ సతీమణి ఉపాసన ట్విట్టర్లో అదే ఫోటో షేర్ చేస్తూ.. ‘‘ఈ ఇద్దరి బంధం ఎంతో దృఢమైంది.. హ్యాపీ బర్త్ డే తారక్..’’ అని ట్వీట్ చేసింది. ఇక త్వరలో రాజమౌళి దర్శకత్వంలో తెరెక్కనున్న మల్టీస్టారర్ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ నంటించనున్న సంగతి తెలిసిందే.
Subscribe
Login
0 Comments