ఒకప్పుడు టాప్ హీరోయిన్లు గా ఉన్న వాళ్ళు ఇప్పుడు మళ్ళీ వేరే విధంగా ఇండస్ట్రీ లోకి తమ సెకండ్ ఇన్నింగ్స్ తో ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పుడు ఈ కోవలోకి హీరోయిన్ రక్షిత చేరారు. ఇడియట్ సినిమాతో తెలుగు తెలుగు తెరకు పరిచయమైన రక్షిత స్టార్ హీరోలైన చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబులతో నటించారు. 2007 లో కన్నడ సినిమా దర్శకుడు ప్రేమ్ ను వివాహం చెసుకొని సినిమాలకు దూరం అయ్యారు.
ఇప్పుడు తన భర్త ప్రేమ్ దర్సకత్వం వహిస్తున్న విలన్ సినిమాలో హీరోయిన్ ఆమీ జాక్సన్ కు డబ్బింగ్ చెప్పారు . ఈ విషయం పై రక్షిత మాట్లాడుతూ ఇన్నాళ్ళు తన పాత్రలకు మాత్రమె డబ్బింగ్ చెప్పానని,ఇప్పుడు ఇతరులకు డబ్బింగ్ చెప్తుంటే చాలా ఇష్టంగా,సంతోషంగా ఉందన్నారు.