ఓ తండ్రిగా మా నాన్న నాకిచ్చిన కానుకలు…

0
385

భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 27వ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబసభ్యులు నివాళులర్పించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా, ఆమె భర్త రాబర్ట్ వాద్రాలు న్యూఢిల్లీలోని రాజీవ్ సమాధి వీర్ భూమికి వెళ్లి ఈరోజు ఉదయం నివాళులర్పించారు. రాజీవ్ సమాధిపై పుష్పగుచ్ఛాలు ఉంచారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పలువురు కాంగ్రెస్ నేతలు రాజీవ్ కు నివాళులర్పించారు. కాగా, తన తండ్రికి నివాళులర్పించడానికి ముందు రాహుల్  ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో తన తండ్రి గొప్పతనాన్ని ప్రశంసించారు. ‘పగ, ద్వేషం వంటి వాటితో ఎవరైతే జీవిస్తారు వారు  జైలులో గడుపుతున్నట్టేనని మా నాన్న నాకు చెప్పారు. ఈరోజు, మా నాన్న వర్ధంతి.. ప్రతి ఒక్కరిపై ప్రేమాభిమానాలు, గౌరవం చూపించాలని చెప్పిన మా నాన్నకు ధన్యవాదాలు. ఓ తండ్రిగా ఓ కొడుకుకిచ్చే ఎంతో విలువైన కానుకలివి’ అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here