జనసేన పోరాట యాత్ర లో భాగంగా నిన్న జరిగిన ఇచ్చాపురం సభలో పవన్ మాట్లాడుతూ ఆవేశానికి లోనయ్యారు . ఆయన మాట్లాడుతూ గత ఎన్నికలలో టీడీపీ గెలుపు కోసం ప్రతీ జనసేన కార్యకర్త చమటోడ్చి శ్రమించటం వలెనే  అధికారంలోకి వచ్చిందన్నారు. జనసేన సైనికుల అండతో గెలిచిన ఎమ్మెల్యేలు నేడు తమకు వ్యతిరేకంగా మాట్లాడడం బాధిస్తోంది ఆవేదన వ్యక్తం చేశారు. వారు ఏ రోజూ తమకు మర్యాద అనేది ఇవ్వలేదని,బయటకు కనిపించే మర్యాద తమకు అక్కర్లేదన్నారు. వెనక నుండి వారేం చేస్తున్నారో తమకు అంతా తెలుసనీ,తామేవీ రాజకీయాలు తెలియని చిన్నపిల్లల్లం కామని, తమకూ గడ్డాలు నెరిశాయని,కాకపోతే రంగు వేసుకుంటున్నామన్నారు. ఆ మాట వినగానే సభా ప్రాంగణమంతా హోరెత్తిపోయింది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments