జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోరాట యాత్ర రెండోవ రోజులో భాగంగా పవన్ ఆడ పిల్ల సమస్యలను ఉద్దేశించి మీడియాతో మాట్లాడారు .పవన్ మాట్లాడుతూ తాను ఏ మూలకెళ్ళినా కానీ ఆడపిల్లలు తమ సమస్యల గురుంచి చెప్పుకుంటున్నారన్నారు. గవర్నమెంట్ విద్యాసంస్థలలో ఎక్కడా కూడా సరైన వసతులు లేక,వారికి ఆర్ధిక స్థోమత లేక చదువు ఆపేసి 15,16 ఏళ్లకే ఆడపిల్లకు పెళ్లి చేసేయాల్సిన పరిస్థితి ఉందని ఆడవాళ్ళు తనతో తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారన్నారు. జనసేన తరపు నుండి తాము కోరుకునేది ప్రభుత్వం అద్బుతాలు సృష్టించాలని కాదని కనీ వైద్యం,విద్యం ముందస్తుగా కావాలని అడుగుతున్నామన్నారు. ప్రజాప్రతినిధుల పిల్లలే కాకుండా అందరికి సమానమైన వసతి ఉండాలన్నారు.

తాను ఓట్లు అడగటానికి రాలేదని కేవలం సమస్యలు తెలుసుకోవడానికి వచ్చానని,కచ్చితంగా సమస్యలను పరిష్కరిస్తామని పవన్ అక్కడ ఉన్న మహిళలతో అన్నారు. 9 నెలల్లో ఆడపిల్లలకు సమస్యలు లేకుండా చేస్తామన్నారు. అక్కడ ఉన్న మహిళ మీరు సమస్య పరిష్కరించటం మరిచిపోకండి అంటే తాను మరచిపోనని,అందుకనే తక్కువ మాట్లాదతానన్నారు. తాను తక్కువ చెప్పి ఎక్కువ చేస్తానని,మిగతావాళ్ళందరూ చాలా ఎక్కువ చెప్పి అసలు చేయరని అదే మిగతావాళ్ళకి తనకి తేడా అని అన్నారు.

ప్రతీ పంచాయితి లో ఒక ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్,ఒక గవర్నమెంట్ డాక్టర్ ఉండాలని, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కచ్చితంగా మూడు,నాలుగు విభాగాలకు సంబంధించి స్పెషలిస్టులు ఉండాలని జనసేన తరపున గవర్నమెంట్ ను డిమాండ్ చేస్తున్నామన్నారు.

 

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments