ఒక్కపటి స్టార్ హీరోలు ఇప్పుడు వైవిధ్యభరితమైన పాత్రలు చేయడానికి మొగ్గుచూపుతున్నారు.  ఇప్పటికే జగపతిబాబు,అర్జున్,అరవింద స్వామీ వంటి వాళ్ళు విల్లన్ గా,క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ ప్రేక్షకుల మన్ననలను అందుకుంటున్నారు.  ఇప్పుడు ఈ కోవలోకి మాధవన్ వచ్చి చేరారు. తెలుగు,తమిళ బాషలలో కధానాయకుడిగా నటించి మంచి పేరు సంపాదించుకున్న ఆయన ఇప్పుడు చండూ ముండేటి దర్శకత్వంలో నాగచైతన్య కధానాయకుడిగా నటిస్తున్న సవ్యసాచి సినిమాలో విల్లన్ గా నటిస్తున్నారు.  తాను ఎవరనేది తెలియకుండా హీరోను టెన్షన్ పెట్టించే పాత్రలో మాధవన్ కనిపించాబోతున్నారని సమాచారం. మరి ఈ చిత్రంలో తన నటనతో మాధవన్ ప్రేక్షకులను ఎలా మైమరిపిస్తారో చూడాలి…

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments