అనూహ్య పరిణామాల మధ్య కర్ణాటకలో జేడీఎస్,కాంగ్రెస్ లు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న విషయం తెలిసినదే . ముఖ్యమంత్రిగా కుమారస్వామి త్వరలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. జేడీఎస్ ,కాంగ్రెస్ నేతలలో ఎవరికీ ఏ పదవి ఇవ్వాలన్న విషయం పై ఇంకా ఏమి స్పస్త్టత రాలేదు . ఈ నేపధ్యంలో కాంగ్రెస్, జేడీఎస్ నేతలు నేడు డిల్లీ వెళ్లి సోనియా,రాహుల్  తో ఈ విషయాలపై చర్చిస్తారని సమాచారం. తన ప్రమాణస్వీకారం కార్యక్రమానికి రావలసిందిగా సోనియా,రాహుల్ ల ను కుమారస్వామి ఆహ్వానించనున్నట్లుగా తెలుస్తోంది. కాగా,మంత్రివర్గ విషయమై కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ నేతృత్వంలోని ప్రతినిధులతో కుమారస్వామి బెంగాళూరులో గత రెండు రోజులుగా చర్చలు జరుపుతున్నారు.

 

 

 

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments